calender_icon.png 6 September, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్‌గౌడ్

06-09-2025 11:24:02 AM

హైదరాబాద్: ఈ సంవత్సరం బాలాపూర్ లడ్డూ(Balapur Ganesh Laddu) కొత్త రికార్డు సృష్టించింది. వేలంలో  బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ రూ.35 లక్షలు పలికింది. వేలం పాటలో లడ్డూను కర్మన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్‌ గౌడ్‌ దక్కించుకున్నారు.  రూ.35 లక్షల నగదును లడ్డూ విజేత దశరథ్ గౌడ్ ఉత్సవ కమిటీకి అందజేశారు. బాలపూర్ గణేశుడి లడ్డూ గతేడాదికంటే రూ. 4.99 లక్షలు అధికంగా పలికింది. లడ్డూ దక్కించుకున్న అనంతరం లింగాల దశరథ్‌గౌడ్‌(Lingala Dasharath Goud ) మాట్లాడుతూ... బాలాపూర్‌ గణేష్ లడ్డూ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. 2019 నుంచి బాలాపూర్‌ వస్తున్న అని చెప్పిన ఆయన గత ఆరు ఏళ్లుగా గణేష్‌ లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కిందని, భగవంతుడు దయదలిచాడు.. చాలా సంతోషంగా ఉందన్నారు. గణేశుడి లడ్డూ తనకు దక్కడం అదృష్టంగా బావిస్తున్నాని దశరథ్‌గౌడ్‌ స్పష్టం చేశారు.