calender_icon.png 6 September, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరకు క్యూ లైన్ లో రైతుల మధ్య ఘర్షణ

06-09-2025 12:46:58 PM

అనంతగిరి: అనంతగిరి ప్రాథమిక సహకార సంఘం నందు గందరగోళం నెలకొంది. యురియా(urea) బస్తాల కోసం రైతులు తెల్లవారుజామునుండే క్యూ లైన్ లో నిలబడ్డారు. నిలబడే క్రమంలో ఒకరు ముందు ఒకరు వెనుక అనే వివాదంతో రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సొసైటీ వద్దకు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యురియా కష్టాలు తప్పడం లేదని అధికారులు కూడా ఎవరూ పట్టించుకోవటం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు.

సొసైటీ పరిధిలో చాలా గ్రామాలు రైతులు ఉంటే కేవలం 270 బస్తాలు మాత్రమే ఉన్నట్లు తెలిసి రైతులు ఘర్షణ పడుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పంటల ఎదుగుదల నుంచి దిగుబడి వరకు అన్నిటిపై ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు. శాస్త్రవేత్తల హెచ్చరికలకు అనుగుణంగానే సకలంలో యూరియా అందకపోవడంతో పంటలు ఎర్రబారుతున్నాయని రైతన్నలు చెప్పారు. అందుకే సకలములో యూరియా అందించాలని రైతులు కోరుతున్నారు.