06-09-2025 11:50:00 AM
కాసరగోడ్: ఉత్తర కేరళ జిల్లాలోని పనాథడి గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలపై(Minor Daughters) ఒకరి తండ్రి యాసిడ్ పోయడంతో వారికి కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు శనివారం తెలిపారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడలోని కరికేకు చెందిన మనోజ్ కె సి (48) పై రాజపురం పోలీసులు(Rajapuram Police) కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారని పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మనోజ్ పణతడి గ్రామంలోని పరకడవులో ఉన్న తన భార్య సోదరుడి ఇంటికి చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
మనోజ్, అతని భార్య వైవాహిక జీవితం అంత సరిగ్గా లేదు. తరచూ గొడవలు జరుగుతుండడంతో, ఆమె ఇంటిని వదిలి తన సోదరుడితో కలిసి ఉంటోంది. శుక్రవారం, మనోజ్ 17 ఏళ్ల కుమార్తె, ఆమె 10 ఏళ్ల బంధువు ప్రాంగణంలో ఆడుకుంటుండగా, రబ్బరు షీట్లను ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే యాసిడ్ బాటిల్‌ను తెరిచి వారిపై పోసి అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు తెలిపారు. యాసిడ్ ప్రభావంతో మనోజ్ కుమార్తె చేయి, తొడపై కాలిన గాయాలు కాగా, ఆమె బంధువు ముఖం, చేతులపై స్వల్పకాలిన గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇద్దరు బాలికలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) సెక్షన్లు 329(3) (నేరపూరిత అతిక్రమణ), 124(1) (యాసిడ్ ఉపయోగించి స్వచ్ఛందంగా తీవ్రమైన గాయాన్ని కలిగించడం), 109(1) (హత్యాయత్నం), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళ, కర్ణాటకలో మనోజ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అవసరమైతే కర్ణాటక పోలీసుల సహాయం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.