calender_icon.png 6 September, 2025 | 3:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

06-09-2025 12:48:42 PM

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ 

కడ్తాల్ : కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామంలో ఇటీవల వివిధ అనారోగ్య  సమస్యలతో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను  శనివారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ మాజీ ఎంపీటీసీ ఉమావతితో కలిసి  పరామర్శించారు.  బాధిత కుటుంబాల కు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ఈర్లపల్లి రాజు,ఈర్లపల్లి బాలయ్య,జంగం పెంటయ్య,కమ్మరి రామచంద్రయ్య,సాభవాట్ కోమిటి,మహమ్మద్ గఫ్ఫార్,ఈర్లపల్లి బుడ్డమ్మ,అన్నెపు పెంటమ్మ, మహమ్మద్ ఉస్మాన్ ఆయా కుటుంబ సభ్యులకు రూ. 5వేల చొప్పున రూ. 45,000 వేలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...  బాధిత కుటుంబాలకు  కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని  ఆయన భరోసా కల్పించారు.

అనారోగ్యంతో మృతి చెందిన  ఈర్లపల్లి రాజు కుటుంబ సభ్యులకు  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారి హామీ మేరకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్, అందజేస్తామని, ఇంటి నిర్మాణానికి(30) సిమెంట్ బస్తాలు కూడా అందజేస్తానని హామీ ఇచ్చారు. వారి ఇద్దరి పిల్లలకు చదువుకు అన్ని విధాలుగా ఆదుకుంటామని మనో ధైర్యం కల్పించారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు వెంకటేష్,రమేష్ నాయక్ మహమ్మద్ చోటా, ఇందిరమ్మ కమిటీ సభ్యులు  కర్ణాకర్ గౌడ్, సుమన్, శంకరయ్య, బాబు,మల్లేష్, మహేష్, లక్ష్మణ్, శివ లు పాల్గొన్నారు.