10 August, 2026 | 5:16 AM

రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి లేఖ

19-06-2024 05:53 PM

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 11 గనులను వేలం వెయ్యాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తెలంగాణ భవన్ లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ... గతంతో తెలంగాణలో ఉన్న గనులను వేలం వెయాలని కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వాన్ని అడిగితే తమ ఒప్పుకోలేదని తెలిపారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇంతవరకు ఎవరు స్పందించలేదని, కేంద్ర ప్రభుత్వం వైఖరికి మీరు ఒప్పుకున్నట్లా..? లేదా అనే దానికి సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.