రేపు, ఎల్లుండి జమ్ముకశ్మీర్ లో ప్రధాని పర్యటన
19-06-2024 06:31 PM
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మూడవ దఫాలో తొలిసారిగా గురువారం జమ్మూ కాశ్మీర్‌లో వెళ్లానున్నారు. రేపు, ఎల్లుండి జమ్ముకశ్మీర్ లో ఆయన పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రూ.1500 కోట్లతో 84 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన యువజన కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 21వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లో దాల్ సరస్సు ఒడ్డున 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రధాని మోదీ నాయకత్వం వహించి, యోగాలో పాల్గొనున్నారు.






