calender_icon.png 13 August, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకు 11 టీఎంసీల నీరు ఏపీ తీసుకునేలా బనకచర్ల పనులు

11-08-2025 12:00:00 AM

- ఈ దోపిడీ ఇలాగే కొనసాగితే 20 రోజుల్లో శ్రీశైలం ఖాళీ  

- ఏపీ బనక చర్ల ప్రాజెక్ట్‌పై భట్టి హాట్ కామెంట్స్

ఖమ్మం, ఆగస్ట్ 10 (విజయ క్రాంతి): రా ష్ట్రంలోని పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నా గార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారానే పం టలు పండుతున్నాయని, ప్రతి రోజూ 11 టీ ఎంసీల నీరు ఆంధ్రప్రదేశ్ తీసుకునేలా పను లు చేస్తుందని, ఈ దోపిడి ఇలాగే కొనసాగితే 20 రోజులలో శ్రీశైలం ఖాళీ అవుతుందని, బాణకచెర్ల ప్రాజెక్టు అడ్డుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నా రు.

ఆదివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క మ ల్లు, మధిర, ఎర్రుపాలెం మండలాలకు సా గునీరు అందించేందుకు 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకం పనులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వా కాటి శ్రీహరి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ల తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఏపీ చేస్తున్న ప నులు అడ్డుకోకపోతే తెలంగాణ సాగర్ ఆ యకట్టు పాలేరు నుండి సత్తుపల్లి వరకు రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తుంది అ ని అన్నారు. నాగార్జునసాగర్ చివరి ఆయకట్టు సాగు నీరు అందేలా పోరాటాలు కొన సాగించాలని అన్నారు.

జలవనరుల శాఖ నుంచి కోర్టు వరకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ రాయలసీమ ప్రాజెక్టు లు, బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకోవాలని అన్నా రు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 7 మండలాలను ఏపి కు కట్టబెట్టడం అన్యాయమని అన్నారు. 

బనకచర్ల ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, తెలంగాణ సాగునీటి ప్రా జెక్టుల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత, జిల్లా లో మన హక్కు తేలిన తర్వాతే కింది రాష్ట్రా లు ప్రాజెక్టుల గురించి ఆలోచించాలని ఆ యన అన్నారు. కట్టలేరు ప్రాజెక్టు ఆధునికర ణ పూర్తి చేశామని అన్నారు. 2012 ప్రాం తంలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మం జూరు ప్రతిపాదనలు సమర్పించామని, గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురి చేశారని అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం దృష్టికి ఈ ప్రాజెక్టు తీసుకుని వచ్చి, సర్వే నిర్వహించి, నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మధిర ప్రాంతంలో అధికంగా వ్యవసాయంపై ప్రజలు ఆధారప డి ఉన్నారని, నీటిని సద్వినియోగం చేసుకుంటేనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. చిరకాలం గుర్తుండే అద్భుతమైన ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొని వస్తామని తెలి పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని, గోదావరి నది బోర్డు నుంచి సిడబ్ల్యుసి వరకు ప్రతి దశలో ఆ ప్రాజెక్టును అడ్డుకుంటామని అన్నారు.

కా ళేశ్వరం ప్రాజెక్టులో గత పాలకులు చేసిన అవినీతి కారణంగానే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ కమిషన్ రిపోర్ట్ అందిం చిందని అన్నారు.ఖమ్మం ప్రాంతంతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. మధిర ప్రాంతానికి గేమ్ చేంజర్ గా జవహర్ ఎత్తిపోతల పథకం ఉంటుందని 630 కోట్లతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథ కం పనులను సంవత్సరం లోపు పూర్తి చే యాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.