11-08-2025 12:00:00 AM
- మారనాయుదాలతో దొంగతనాలకు యత్నం
- భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
ఖమ్మం, ఆగస్ట్ 10 (విజయ క్రాంతి): ఇటీవల ఖమ్మం జిల్లాలో దొంగతనానికి ప్రయ త్నించిన దొంగల సిసి ఫుటేజ్ లను చూసి ప్ర జలు భయాందోళనకు గురవుతున్నారు. గ తంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చొరబడి వస్తువులు ఉంటే ఎత్తుకొని వెళ్లేవారు. ఈసా రి ఏకంగా మారనాయుధాల తోటి తిరుగు తూ ఏ ఇంటికి తాళం వేసిందా అని పరిశీలిస్తూ తాళాలు వేసి ఉన్న ఇంట్లో చొరబడు తున్నారు.
వివరాల్లోకెళ్తే... ఇటీవల ఖమ్మం జిల్లా కేంద్రంకు కూతవేటు దూరంలో ఉన్న గొల్లగూడెం ప్రాంతంలో దొంగలు మారణాయుధాలతో రాత్రి రెండు గంటల ప్రాంతం లో తిరుగుతున్నారు. ఒక ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి ప్రయత్నించారు. అక్కడ ఏమి దొ రక్కపోవటంతో కాలనీలోనే పలు వీధులు ఆయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
మరోవైపు జిల్లాలోని సత్తుపల్లి పట్టణంలోని విరాట్ నగర్ శివారులో గల పీవీ నరసింహారావు సింగరేణి కాలరీలోనూ దొంగలు దొంగతనానికి చేస్తున్న ప్రయత్నాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.కనిపిస్తే కథమేనా గొల్లగూడెం ప్రాంతంలో దొంగతనానికి ముగ్గు రు వ్యక్తులు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మారణాయుధాలతో తిరుగుతున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదృష్టవశాత్తు ఆ టైంలో ఎవరు వారికి కనిపించకపోబట్టి పెను ప్రమాదం తప్పింది.
ఒ కవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా వారి కంటబడినట్లైతే సీన్ వేరే తీరుగా ఉండేదేమో అని ప్రజలు అనుకుంటున్నారు. వారి ప్రవర్తన, చేతుల్లో వున్న ఆయుధాలను బట్టి చూస్తే వా రు ఏమి చేయడానికైనా వెనకాడేటట్టు లేరు అని అనిపిస్తోంది. ఒకవేళ అదే సమయంలో ఎవరైనా వేరే ఊరు వెళ్లి ఆ కాలనీలోని ఇం టికి రావడం కానీ, కాలనీ వారు ఆ సమయంలో ఎటైనా వెళ్లేందుకు బయటకు వచ్చి వీరి కంట పడితే వారు ఏమైనా చేసి ఉండేవారెమో అని ప్రజలు అనుకుంటున్నారు. పోలీస్ వారు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.