calender_icon.png 11 August, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటల పోటీలు నిర్వహించడం అభినందనీయం

10-08-2025 11:56:39 PM

నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి

పాటల పోటీల విజేతలకు బహుమతుల ప్రధానం

కోదాడ: చిరంజీవి అభిమానులు రక్తదానం నేతదానం కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక సామాజిక రంగాలలో కూడా ముందుండటం అభినందించ దగ్గర విషయం అని నియోజకవర్గ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి అన్నారు.  మెగాస్టార్ పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం కోదాడలోని స్థానిక కిడ్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో  రాష్ట్రస్థాయి పాటల పోటీలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా చిరంజీవి యువత  గుండెపంగు  రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ నియోజక వర్గ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి హాజరై పాటలు పోటీలో పాల్గొన్న వారికి మొదటి ద్వితీయ తృతీయ కన్సోలేషన్  బహుమతులతో పాటు ప్రధానం చేయడం వాటితో పాటు పాటల పాడిన అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను మరియు గోల్డ్ మెడల్స్ కూడా అందించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నెతలుగా వ్యవహరించిన ప్రముఖ వాగ్గేయకారులు సినీ గేయ రచయిత మాస్టర్జి , సినీ మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్  వీరుతోపాటు గాలి శ్రీనివాస్ నాయుడు, బాదే రాము, బలుగూరి స్నేహ, డాక్టర్.నందిపాటి శ్రీ ప్రియ, మాతంగి శైలజ న్యాయ నిర్ణీతలుగా వ్యవహరించారు. విశిష్ట అతిథిగా  అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్న గౌడ్, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మీలా సత్యనారాయణ, టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి , సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు,

ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు తెర సాంస్కృతిక మండలి అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు ఎంఈఎఫ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు, నందిపాటి సైదులు, షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఏర్పుల తీరూప్,ఇరుగు కిరణ్, ఓరుగంటి పాండు, అబ్బి మల్ల  రవి,  రామ్ చరణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కుడుముల శివ, ఉడుముల ప్రశాంత్ కుడుముల రాంబాబు గుండెపంగు రవి, రజిని, యేసు పాల్గొన్నారు.