calender_icon.png 16 January, 2026 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతరకు ముస్తాబైన శ్రీ రామలింగేశ్వర స్వామి

15-01-2026 12:48:04 AM

  1. నేడే రామప్పగుట్టపై ఉత్సవాలు

బండ్లు బోనాల ఊరేగింపు ప్రదర్శన

తూప్రాన్, జనవరి 14 :అతి పురాతన విశిష్టత కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి రామ ప్పగుట్టపై సంక్రాంతి పర్వదినాన మూడు రోజులపాటు ఘనంగా జాతర ఉత్సవాలు కొన సాగుతాయి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ పరిధిలోని ఎత్తున కొండపైన కొలు వై ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి జాతరోత్సవాలు ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి,

ఆలయ కమిటీ నేతలు సురేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, గ్రామ కుల పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. గురువారం ప్రారంభం కానున్న ఈ జాతరలో శ్రీ శ్రీ రామలింగేశ్వరునికి హో మాలు, యాగాలు, పూజలు నిర్వహిస్తారు. అనంతరం గ్రామస్తులు బండ్ల బోనాల ఊరేగింపు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. మరునాడు మల్లన్న ఒగ్గు కథలు కళాకారుల నృత్యాలతో బ్రహ్మాండంగా నిర్వహిస్తారు.

పురాతన మహిమ గలిగిన దేవాలయం...

అతి పురాతన విశిష్టత కలిగిన దేవాలయం రామప్ప గుడి. ఈ ఆలయంలో కొలువైన రామలింగేశ్వర స్వామీకి ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. మెదక్ జిల్లాలోని పలు మండలల గ్రామాల నుండి భారీగా భక్తజన సందోహం చేరి సందడి చేయడం జరుగుతుంది. కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా కొలువైయున్నాడు. భక్తులకు, వీక్షకులకు మానసిక ఉల్లాసంతో పాటు అమితానంద భరితులై ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.