17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడిగా బండారి రమేష్

07-04-2025 01:08 AM

మానకొండూర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ తిమ్మాపూర్ మండల అధ్యక్షునిగా పోలంపల్లి మాజీ ఎంపీటీసీ బండారి రమేష్ ను పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియమించారు.  ఈ మేరకు ఆదివారం పోలంపల్లి గ్రామంలో శ్రీరామ నవమి వేడుకలకు హాజరైన సందర్భంగా రమేష్ కు ఆయన నియామక పత్రం అందజేశారు. మండల పార్టీ అధ్యక్షుడుగా నూతనంగా నియామకమైన బండారు రమేష్ ను అభినందిస్తూ మండలంలో పార్టీ పటిష్టతకు, పార్టీ శ్రేణుల్లో ఐక్యతకు పాటుపడాలని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడి పని చేయాలని ఆయన ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  తుమ్మనపల్లి శ్రీనివాసరావు, బొడిగె కొండయ్య, మామిడి అనిల్ కుమార్, కొత్త తిరుపతిరెడ్డి, భూదారపు శ్రీనివాస్, సిరిగిరి రంగారావు, గుంటి మల్లేశం, రెడ్డిగాని రాజు, కొత్తపల్లి వినోద్, డి సురేందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.