calender_icon.png 14 January, 2026 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బండాయప్ప మఠం ఎంతో పవిత్రమైనది

14-01-2026 03:06:27 PM

మఠాధిపతి సోమయప్ప స్వామి కాంగ్రెస్ భవనంగా మార్చారు

రాజకీయాల్లో రావాలనుకుంటే ప్రత్యక్షంగా రావాలని, పరోక్షమైన రాజకీయాలు చేయవద్దన్నారు

మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు జరగకపోవడం, అధికారుల నిర్లక్ష్యం మూలాన ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో బిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు హనుమంతు షిండే ఆధ్వర్యంలో రోడ్డుపై ముగ్గులు వేసి నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన సెంట్రల్ లైటింగ్ పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా పూర్తి చేయకపోవడం సిగ్గుచేటని, వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వివరించడంపై మండిపడ్డారు.

గతంలో బిచ్కుంద యువకులు నిరసన కార్యక్రమాన్ని చేపడితే వారి పైన కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు, ప్రశ్నిస్తే కేసులు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు హితువు పలికారు. బండయప్ప మఠం ఎంతో పవిత్రమైనదని దానికి ఇప్పుడున్న మఠాధిపతి సోమయప్ప స్వామి కాంగ్రెస్ భవనంగా మార్చాలని దుయ్యబట్టారు.

రాజకీయాల్లో రావాలనుకుంటే ప్రత్యక్షంగా రావాలని, పరోక్షమైన రాజకీయాలు చేయవద్దని ప్రత్యక్షంగా వస్తే తాడోపేడో తేల్చుకుందాం అని అన్నారు. రోడ్డు పనులు జరగకపోతే నిరసనని ఉదృతం చేస్తామని హనుమంతు సిందే హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నలచారి బాలాజీ, శ్రీనివాస్, ఎన్ శ్రీనివాస్, యాదవ్, హాజీ లక్ష్మణ్, డాక్టర్ రాజు, పిట్ల సాయికుమార్, దర్పల అశోక్, చాకలి విట్టల్, అవర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.