14-01-2026 02:46:23 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసంపల్లి గ్రామం నుండి ప్రధాన రహదారి వెంబడి వెళ్తుండగా చిన్న ఆత్మకూర్ గ్రామ శివారు పరిధిలో గల వైకుంఠదామం సమీపాన ప్రధాన రహదారిపై పెద్దగుంత ఏర్పడి రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు తెలిపారు. రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి పంట పొలాలు రైతులు ప్రధాన రోడ్డును చీల్చి పైప్ లైన్ వేసి కొంత మేర మట్టితో పూడ్చినప్పటికీ పూర్తిస్థాయిలో గుంత మట్టితో నిండకపోవడంతో మళ్లీ గుంతగా ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తుంది.
ఆ రోడ్డు వెంబడి మాసానిపల్లి, మాటూర్,తాండూర్, జలాల్పూర్,చిన్నఆత్మకూర్, పెద్దఆత్మకూర్ గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు.అతివేగంగా యువకులు బైకులు నడుపుతూ పడే ఆస్కారం ఉందని,రాత్రివేళలో అయితే గుంత కనబడదు.దీనిపై ఆర్అండ్బి అధికారులు స్పందించి పైప్ లైన్ కోసం తీసినటువంటి రైతులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.లేకపోతే ఎవరి ప్రాణాలైనా పోయే ఆస్కారం ఉందని ప్రయాణికులు మండిపడుతున్నారు.