calender_icon.png 14 January, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకర్లపల్లిలో యాదవ్ కులస్థుల అధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాలు

14-01-2026 03:50:02 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న యాదవ కుటుంబ సభ్యులు 

మంథని,(విజయ క్రాంతి): యాదవ్ కులస్థుల అధ్వర్యంలో మంథని మండలంలోని కాకర్లపల్లి గ్రామంలో బుధవారం పెద్దమ్మ తల్లికి  బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ బోగి రోజున గ్రామంలోని యాదవ కులాస్థులు కుటుంబ సభ్యులతో పాల్గొని పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడు కూడా యాదవలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి,  బోనాలు సమర్పించారు. ఆ అమ్మవారి ఆశీర్వాదాల తో గ్రామ ప్రజలు, పిల్లజెల్ల, పడిపాశువులు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.  ఈ బోనాల వేడుకల్లో స్థానిక సర్పంచ్ కలవేన కొమురయ్య యాదవ్ తో పాటు కుల పెద్దలు అధిక సంఖ్యలో యాదవ్ లు పాల్గొన్నారు.