22-08-2025 02:15:31 PM
స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత
మిడ్జిల్: మార్వాడీల వ్యాపార ఆధిపత్యం పై నిరసనగా నేడు తెలంగాణ రాష్ట్ర బందు పిలుపుమేరకు మిడ్జిల్ మండలం(Midjil mandal ) లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు, ఈ సందర్భంగా వ్యాపార సంఘం అధ్యక్షులు గంజి కృష్ణ మాట్లాడుతూ మార్వాడీలు ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారని తమ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు . వాచ్మెన్ నుంచి సర్వెంట్ల వరకు తమ వారికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శించారు.
స్థానికులకు ఉపాధి లేకుండా ఉన్న వ్యాపారులకు గిరాకి లేకుండా చేస్తూ ఇక్కడే ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని ఈ విషయాన్ని పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నమిత లేని వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలకు మోసం చేస్తూ వ్యాపారం చేసుకుంటున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ విధానాలకు స్వాగతి పలకవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నిరసన కార్యక్రమం పరిగణలోకి తీసుకొని అన్ని వ్యాపార సముదాయాలు బందు పాటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.