calender_icon.png 22 August, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్వాడి హటావో తెలంగాణ బచావో

22-08-2025 02:10:58 PM

నకిరేకల్,(విజయక్రాంతి): తెలంగాణలో నాసిరకం వస్తువులను అమ్మత్తు ప్రజల మోసం చేస్తున్న మార్వాడి వ్యాపారాలు తెలంగాణ నుండి గో బ్యాక్(Marwadi Hatao Telangana Bachao) అంటూ మార్వాడిలా వ్యాపారాల విధానాలకు వ్యతిరేకంగా లోకల్ వ్యాపారస్తులు తలపెట్టిన బంద్ నకిరేకల్ నియోజకవర్గవ్యాప్తంగా విజయవంతమైంది.. కట్టంగూర్ నకిరేకల్ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మార్వాడిల కంగా నినాదాలు చేశారు. స్థానిక వ్యాపారాలనుప్రోత్సహించాలి. గుజరాత్ రాజస్థాన్ మార్వాడిల దౌర్జన్యాన్ని అరికట్టాలని  పలువురు డిమాండ్ చేశారు. తెలంగాణ బచావో మార్వాడి హటావొ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గుండా శ్రీకాంత్, బుడ్డే వెంకట్రావు, కోటగిరి శ్రీనివాస్ ,మహమ్మద్ హాజీం, వెంకటనారాయణ, రంగయ్య, ప్రకాష్ పటేల్ ,మమ్మద్ జానీ, చారి తదితరులు పాల్గొన్నారు