22-08-2025 02:13:36 PM
రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేని సమయంలోనే హైదరాబాద్ లో కులమతాలకు అతీతంగా హాస్టల్ నిర్మించి పేద విద్యార్థులకు పెన్నిధి గా రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి నిలిచారని ఉ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy ) పేర్కొన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి 156 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహబూబ్ నగర్ నగరంలో పద్మావతి కాలనీలో గ్రీన్ బెల్ట్ లో ఉన్న రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎలాంటి వసతులు లేని సమయంలోనే హైదరాబాద్ లో కులమతాలకు అతీతంగా హాస్టల్ నిర్మించి పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారని , మహిళలు చదువుకుంటే సమాజం బాగుపడుతుందని భావించి , 100 సంవత్సరాల క్రితమే రెడ్డి మహిళా కళాశాల ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి ప్రేరణతో మహబూబ్ నగర్ లో నిర్మించిన రెడ్డి హాస్టల్ ఇప్పుడు ఐఐఐటి కళాశాలకు తాత్కాలిక భవనం గా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని విద్యా నిధికి చేయూతనిచ్చి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పాలమూరు రెడ్డి సంఘం అధ్యక్షులు తూము ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి వేపూరి రాజేందర్ రెడ్డి, సభ్యులు మల్లు నర్సింహ్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, మద్ది యాదిరెడ్డి, మద్ది అనంత రెడ్డి, విఠల్ రెడ్డి, పి.రఘురామి రెడ్డి, సరస్వతి, స్వరూప, శోభ, వనజ తదితరులు పాల్గొన్నారు.