calender_icon.png 22 August, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22వ వార్డులో వైద్య శిబిరం

22-08-2025 03:09:39 PM

ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశం మేరకు ఇల్లందు ప్రభుత్వాసుపత్రి ఆధ్వర్యంలో పట్టణంలో వైద్య శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా 22వ వార్డులో నిర్వహించిన వైద్య శిబిరానికి అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన రోగులకు ఉచిత మందులను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ కౌన్సిలర్ అంకపాక నవీన్ కుమార్, వైద్య సిబ్బంది ఎస్ సంపూర్ణ హెచ్ఎస్(ఎఫ్), ఈ.అరుణ, జే.సింధు ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఆశ వర్కర్లు సిహెచ్ కరుణ, సిహెచ్ రేణుక, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.