calender_icon.png 22 August, 2025 | 6:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయాల్సింది అరెస్టులు కాదు.. సమస్యల పరిష్కారం

22-08-2025 02:48:52 PM

హైదరాబాద్: రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన నాయకులు, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేయాల్సింది అరెస్టులు కాదు.. సమస్యలు పరిష్కారం అని ప్రభుత్వాన్ని కోరారు. నిరంకుశ విధానాలు మానకపోతే ప్రజా క్షేత్రంలో మట్టి కరిపించడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపు నిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజా సమస్యలపై సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావును(BJP state president arrested) చేవెళ్ల పర్యటనలో ఉన్న సమయంలోనే మొయినాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) పరిధిలోని సమస్యల పరిష్కారం డిమాండ్ చేస్తూ శుక్రవారం మధ్యాహ్నం పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు, మద్దతుదారులు “సేవ్ హైదరాబాద్”(Save Hyderabad) బ్యానర్‌తో తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నిరసన దృష్ట్యా, సచివాలయం చుట్టూ పోలీసులు భారీ భద్రతను మోహరించారు. బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు సచివాలయం ముట్టడిలో పాల్గొన్నారు. ముట్టడి నేపథ్యంలో అనేక మంది నిరసనకారులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు.