19-12-2025 02:40:51 PM
నాగ్‌పూర్: నాగ్‌పూర్ నగర శివార్లలోని ఒక పారిశ్రామిక యూనిట్‌లో శుక్రవారం నీటి ట్యాంకు కూలిపోవడంతో(Water Tank Collapses) ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఎంఐడీసీ బుటిబోరి ప్రాంతంలో ఉన్న ఒక సోలార్ ప్యానెల్ తయారీ కర్మాగారంలో ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అవాడా ఎలక్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో(Avaada Electro Private Limited factory) నేలమట్టంలో నిర్మించిన ఒక భారీ నీటి ట్యాంక్ కూలిపోవడంతో, దాని శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న రక్షణ, పోలీసులు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.