calender_icon.png 19 December, 2025 | 4:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయదుర్గంలో గంజాయి పట్టివేత.. టార్గెట్ ఐటీ ఉద్యోగులే

19-12-2025 02:32:13 PM

హైదరాబాద్: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో(Raidurgam) గంజాయి పట్టుబడింది. నిందితుడు సోహెల్ ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా గంజాయి(Marijuana) సరఫరా చేస్తున్నాడు. గంజాయి వినియోగించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 17 కిలోల గంజాయి, 2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. సోహెల్ మహారాష్ట్ర నుంచి గంజాయి తెచ్చి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఎన్డీపీఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.