ముగిసిన బండి భగీరథ్ పోలీసుల కస్టడీ
హైదరాబాద్: పోక్సో కేసు నిందితుడు, కేంద్ర మంత్రి X కుమారుడు బండి భగీరథ్ పోలీస్ కస్టడీ(Bandi Bhagirath Police Custody Interrogation Concludes) ముగిసింది. పోక్సో కేసులో భగీరథ్ ను పోలీసులు విచారించారు. మొత్తం మూడ్రోజులపాటు ఇంటరాగేషన్ చేశారు. విచారణలో భాగంగా భగీరథ్‌ను మొయినాబాద్ ఫామ్ హౌస్‌కి తీసుకెళ్లి సీన్- రీ కనస్ట్రక్షన్ పూర్తి చేశారు. కస్టడీ ముగియడంతో బండి భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ మల్కాజిగిరి కోర్టులో హాజరుపర్చారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం భగీరథ్ ను మళ్లీ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. బండి భగీరథ్ పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సాక్ష్యాలను ధ్వంసం చేయడం, సోషల్ మీడియా ఖాతాలను తొలగించడం, తన మొబైల్ ఫోన్‌లను ధ్వంసం చేయడం/ఫార్మాట్ చేయడం, సిమ్ కార్డులు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నాశనం చేయడం వంటి విషయాలపై బండి సాయి భగీరథ్ ను పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 25 ఏళ్ల బండి భగీరథ్ , 17 ఏళ్ల మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. బాధితులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన 9 రోజుల తర్వాత అతను అరెస్టు అయ్యాడు.






