బండి భగీరథను వెంటనే అరెస్టు చేయాలి
గరిడేపల్లి,(విజయక్రాంతి): మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథను తక్షణమే అరెస్టు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మహిళలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు.గ్రామ చౌరస్తాలో మహిళలు ప్రజాసంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి పోలీసుల యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్దపెటున్న నినాదాలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి వారం రోజులు గడుస్తున్న నేటికీ అతనికి అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు.
ఆర్థిక బలం అధికార బలం కలిగిన వారు తప్పు చేస్తే ఒక విధానం సామాన్యులు తప్పు చేస్తే మరొక విధానం అవలంబించడం సరైన విధానం కాదని అన్నారు.దీనిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కానీ తప్పుచేసిన తన కొడుకుని పోలీసులకు అప్పగించకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పించుకు తిరుగుతున్నాడని అన్నారు.అత్యాచారానికి గురైన కుటుంబం పై కుటుంబ సభ్యులపై అనేక ఏ దింపులకు గురిచేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని వారు వెచ్చరించారు.కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం గ్రామ నాయకురాలు నాగమణి,సుశీల,వెంకటమ్మ,ఎల్లమ్మ,ఇందిర,ఎల్లమ్మ,హసిత,వెంకటమ్మ,మంగమ్మ,పలువురు పాల్గొన్నారు






