10 June, 2026 | 1:39 AM

కంగారులకు బంగ్లాదేశ్ షాక్

10-06-2026 12:00 AM

తొలి వన్డేలో సంచలన విజయం

ఢాకా, జూన్ 9 : ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు పసికూన బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. స్వదేశంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్లో 86 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది.

36 ఏళ్ల చరిత్రలో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై వన్డేల్లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 2005లో కార్డిఫ్లో జరిగిన మ్యాచ్లో తొలిసారి బంగ్లా జట్టు ఆసీస్కు షాకిచ్చింది. తొలు త బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆరో నంబర్ ఆటగాడు మొసద్దెక్ హొస్సేన్ (86 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది.  బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ తమీమ్ (54), నజ్ముల్ హొస్సేన్ షాంటో (67) కూడా అర్ద సెంచరీలతో రాణించారు.

ఆసీస్ బౌలర్ల లో నాథన్ ఇల్లిస్ (10 అద్భుతం గా బౌలింగ్ చేయగా.. లియామ్, మ్యాట్ రెన్షా తలో 2 వికెట్లతో పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. కామెరూన్ గ్రీన్ (52) ఒక్కడే అర్ధశతకంతో పోరాడగా.. మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. బంగ్లాదేశ్ పేసర్ నహీద్ రాణా (4/41) దెబ్బకు కంగారూలు చేతులెత్తేశారు.  బ్యాటింగ్‌లో సత్తా చాటిన మొసద్దెక్ బౌలింగ్లోనూ చెలరేగడంతో ఆస్ట్రేలియా 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లా దేశ్‌ను విజేతగా ప్రకటించారు.