రోహిత్ శర్మ, హార్దిక్ ఫిట్
క్లియరెన్స్ ఇచ్చిన బీసీసీఐ సీఓఈ
ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్ రెడీ
బెంగళూరు, జూన్ 9: అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. పాండ్యాకు బీసీసీఐ సీఓఈ స్పోరట్స్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ లభించింది.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన పలు మ్యాచ్ సిమ్యులేషన్లలో పాండ్యా పాల్గొన్నాడని, ఎక్కడా అసౌకర్యంగా కనిపించలేదని మెడికల్ బృందం వెల్లడించింది. అతడు పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో జూన్ 13 నుంచి ధర్మశాల వేదికగా జరగనున్న భారత్, ఆఫ్గన్ తొలి వన్డేలో పాండ్యా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఇప్పటికే ఫిట్నెస్ నిరూపించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అప్ డేట్ ఇచ్చాడు. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు రోహిత్, పాండ్యా అందుబాటులో ఉంటారని తెలిపాడు. అయితే ఫిట్నెస్ క్లియరెన్స్కు సంబంధించి సర్టిఫికెట్ను మెడికల్ సీవోఈ బృందం ఇంకా అందించలేదు. అయితే వారి నుంచి ఒక్కసారి క్లియరెన్స్ వస్తే మాత్రం రోహిత్, పాండ్యాలు అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో ఆడతారని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్లకు అందుబాటులో లేడు. కండరాల గాయంతో గ్రూప్ దశలో ఐదు మ్యాచ్‌కు దూరమవ్వగా, పాండ్యా లీగ్ ఆఖరి దశలో వెన్నునొప్పి కారణంగా చివరి మ్యాచ్లకు దూరమయ్యాడు.






