10 June, 2026 | 1:24 AM

సిరాజ్ ఔట్.. ప్రసిద్ధ్ కృష్ణ ఇన్

10-06-2026 12:00 AM

ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ జట్టులో మార్పు

హైదరాబాదీ పేసర్‌కు విశ్రాంతి

ముంబై, జూన్ 9: ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ల కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా లీడింగ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఈ సిరీస్ల నుంచి విశ్రాంతి ఇచ్చారు. నిరంతరాయంగా క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సిరాజ్ స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను 15 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపిక చేశారు. బోర్డు వైద్య బృందం, టీమ్ మేనేజ్మెంట్తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే సిరాజ్కు రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు.

ర్యటనల కోసం బీసీసీఐ ఎక్కువగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును రంగంలోకి దించుతోంది. ఈ లైనప్కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. కాగా జూన్ 26న ఐర్లాండ్తో భారత్ తన మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే జూలై 1 నుంచి ఇంగ్లాండ్తో అసలైన సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శివం దూబె, తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ