6 July, 2026 | 2:24 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •  

క్యాబినెట్‌లో బంజారాలకు స్థానం కల్పించాలి

13-06-2025 12:00 AM

బంజారా గిరిజన జేఏసీ నాయకుడు డాక్టర్ వెంకటేష్ చౌహన్

ముషీరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): బంజారా సమాజ ఆత్మగౌరానికి ప్రతికగా రాష్ట్ర క్యాబినెట్ లో బంజారాలకు ఒక స్థానం కేటాయించాలని బంజారా గిరిజన జేఏసీ నాయకులు డాక్టర్ వెంకటేష్ చౌహన్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వం ప్రతీ క్యాబినెట్లో బంజారాలకు స్థానం ఉండేదని, నేడు లేకపోవడం బాధాకరమన్నారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బంజారా గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం లో డాక్టర్ రాజేష్ నాయక్ తో కలసి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65 స్థానాలు బంజారాలు బలంగా ఉన్న నియోజకవర్గాలే ఉన్నాయని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కి వన్ సైడ్‌గా ఓటు వేసిన సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అని బంజారాలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండే సమాజం అని తెలియజేశారు. బంజారా సమాజం నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యేకైనా అవకాశం ఇవ్వాలని కోరారు. మూడావత్ కార్తీక్ నాయక్, శ్రీమాన్ నాయక్, జె.డి నాయక్, ధరావత్ వినోద్ నాయక్, ఐతరాజు అభయ్, అనిల్ చారి, కొండ్రపల్లి రమేష్, మహేష్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.