16 July, 2026 | 9:16 AM

సిరిసిల్ల అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా

07-06-2024 01:33 AM

రాజన్న సిరిసిల్ల, జూన్ 6 (విజయక్రాంతి): సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. 12 డివిజన్లకు 8 డివిజన్లలో బీఆర్‌ఎస్ ప్యానల్ డైరెక్టర్లుగా గెలిచారు. మెజారిటీ స్థానాల గెలుపుతో చైర్మన్ స్థానాన్ని బీఆర్‌ఎస్ కైవసం చేసుకోనుంది. 12 డివిజన్లలో 6,177 ఓటర్లు ఉన్నారు. 4,755 మంది ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ 77 శాతం నమోదైంది. ౮ మంది అభ్యర్థులు విజయం సాధించడంతో అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎన్నికవనున్నారు.

12 డైరెక్టర్ స్థానాలలో 8 స్థానాలు బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఒక స్థానంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, ఒక స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మారో రెండు స్థానా ల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఫలితాల అనంతరం గెలుపొందిన అభ్యర్థులను బీఆర్‌ఎస్ నాయకులు క్యాంపునకు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు వాగ్వాదం చోటుచేసుకుంది.