16 July, 2026 | 9:32 AM

కిషన్ రెడ్డిని కలిసిన ఎంపీ గోడం నగేష్

07-06-2024 01:26 AM

ఆదిలాబాద్, జూన్ 6 (విజయ క్రాంతి): ఇటీవలి ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన గోడం నగేష్.. ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి గురువారం ఢిల్లీలో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఆయన నివాస గృహంలో  మర్యాదపూరకంగా కలుసుకున్నారు. కిషన్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే వెంట జిల్లా నేత ముస్తాపూర్ అశోక్  ఉన్నారు.