11 April, 2026 | 4:11 AM

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం

11-04-2026 02:02 AM

ఆకస్మిక తనిఖీల్లో 189 మందికి పాజిటివ్

వివరాలు వెల్లడించిన టాస్క్ ఫోర్స్ డీసీపీ

వైభవ్ రఘునాథ్ గైక్వాడ్

బంజారాహిల్స్, ఏప్రిల్ 10(విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల కట్టడికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఆదేశాల మేరకు గురువారం టాస్క్ ఫోర్స్, హైద రాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సంయుక్తంగా నగరవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

రౌడీ షీటర్లు, గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారు, అనుమానిత వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని స్థానిక పోలీసుల సమన్వయంతో ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగింది. అందుకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘు నాథ్ గైక్వాడ్ శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ప్రకారం తనిఖీల్లో భాగంగా మొత్తం 239 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. గాంధీ, ఉస్మానియా, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయాల్లో నిర్వహించిన పరీక్షల్లో ఏకంగా 189 మంది డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయిందన్నా రు. ముఖ్యంగా ఎర్రగడ్డ ఆసుపత్రిలో పరీక్షించిన 89 మందిలో 86 మందికి పాజిటివ్ రా వడం గమనార్హమన్నారు.

డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుం డా, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారన్నారు. బాధితులు వ్యసనం నుంచి బయటపడేందుకు పునరావాసం ఎంత అవసరమో వైద్యులు వారికి వివరించారన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలి పారు.  డ్రీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ప ర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపిలు అందె శ్రీనివాస్, ఇక్బాల్ సిద్ధిఖీ తదితరులు పాల్గొన్నారు.