4 April, 2026 | 6:59 PM

బార్ అసోసియేషన్ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

04-04-2026 05:21 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన బత్తుల నారాయణను శనివారం ఘనంగా సన్మానించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనకు శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన  నారాయణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఆయన సతీమణి  గతంలో తాడువాయి జడ్పిటిసి గా బాధ్యతలు నిర్వహించి మండల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముదాం నర్సింలు, నాయకులు మహిపాల్ రెడ్డి, రమేష్,గోపాల్ రావు, రాములు, మంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.