29-07-2025 12:41:45 AM
నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ జూలై 28 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర జడ్జిల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన జడ్జిలు కుమారమ్ గోపికృష్ణ, ఖుష్భూ ఉపాధ్యాయ్ లకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యాక్షుడు దిలీప్ లు తమ సహచర కార్యవర్గ సభ్యులు రమాదేవి, ప్రవీణ, మద్దెపల్లి శంకర్, ముబీన్, నారాయణ ల ప్రతినిధి బృందంతో కలిసి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు జల్లులు కురిపించారు.
గోపికృష్ణ నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా, ఖుష్భూ ఉపాధ్యాయ్ నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (జూనియర్ సివిల్ జడ్జి) గా ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర జడ్జిల సంఘం ఎన్నికల ఫలితాలు ఆది వారం వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జడ్జిలుగా ఉన్న ఇద్దరు న్యాయమూర్థులు, రాష్ట్రస్థాయి జడ్జిల సంఘంలో కార్యవర్గ సభ్యులుగా, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై కీలక భూమిక నిర్వహించబోవడం శుభ సంకేతమని సాయరెడ్డి, మాణిక్ రాజు లు తెలిపారు.
బార్ ఎల్లవేళల న్యాయాధికారుల శ్రేయోభిలాషులుగా వారి ఉన్నతిని ఆకాక్షిస్తుందని వారు అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన చారిత్రత్మాక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర జడ్జిల సంఘం ఆవిర్భావించిందని వారు గుర్తు చేశారు.