29-07-2025 12:41:50 AM
కరీంనగర్ క్రైం, జూలై 28 (విజయ క్రాంతి): నగరంలోని కిసాన్ నగర్లో సోమవారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆప రేషన్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 71 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 64 బైకులు, 5 ఆటో లు, ఒక ట్రాలీ ఆటో, ఒక కారు ఉన్నాయి.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు స్థానిక ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మా ట్లాడుతూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.