18 July, 2026 | 3:13 AM

బార్ షాపు అనుమతి రద్దు చేయాలి

04-09-2025 01:40 AM

వడ్డెపల్లి, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): హనుమకొండ వడ్డెపల్లి చర్చి జంక్షన్లో బార్ అండ్ రెస్టారెంట్ కు అనుమతిని రద్దు చేయాలని వడ్డెపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌ను కోరారు.

బుధవారం హనుమకొండలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.  ఈ సందర్భంగా వడ్డెపల్లి దళిత వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు తాళ్లపెల్లి రవీందర్ (జేకే), ప్రధాన కార్యదర్శి తాళ్లవెల్లి ప్రవీణ్ కుమార్, కోశాదికారి నల్ల ఆశీర్వాదం లు మాట్లాడురు.