13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

M. M. Keeravani తండ్రి శిష్యుడి డైరెక్షన్‌లో ‘బర్బరీకుడు’ సినిమా ప్రారంభం – కురుక్షేత్ర యోధుడి కథ

26-03-2026 01:35 AM

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రి శివశక్తి దత్త శిష్యుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో చిత్రాలకు అసిస్టెం ట్ డైరెక్టర్‌గా, పాటల రచయితగా పనిచేసిన శివఝాన్సిరే గాల ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నా రు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోని ఒక యోధుడి కథను ఆయన తెరపైకి తీ సుకొస్తున్నారు. ‘బర్బరీకుడు ద సన్నాఫ్ ఘ టోత్కచ’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

పీపీ మూవీ మేకర్స్, రేణుక ఎల్లమ్మ క్రియేషన్స్ బ్యానర్లపై టీ మల్లేశ్వరుడు, అంతటి నరేశ్ కుమార్, అంతటి రాజేశ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఫైట్స్ మాస్టర్స్ రామ్‌లక్ష్మణ్‌ల శిష్యుడు, స్టంట్ మాస్టర్ బద్రి మాస్టర్ అల్లుడు కృష్ణ భారత ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమవుతున్నారు. తనదైన వాయిస్‌తో ప్రేక్షకులను ఒప్పించి, తెరపై విలన్‌గా మెప్పించిన రవిశంకర్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు.

సమ్మెట గాంధీ, జబర్దస్త్ చిట్టిబాబు, ఆనంద్ భారతి వివిధ పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రానికి జీఎం సతీశ్ సంగీతం అందిస్తుండగా, శ్యామ్ కే నాయుడు డీవోపీగా, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.