26 March, 2026 | 3:22 AM

ప్రేమ కాస్త పిచ్చివాళ్లను చేస్తుంది!

26-03-2026 01:37 AM

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే, నటుడు లక్ష్య జంటగా నటి స్తున్న సరికొత్త సంగీత ప్రాధాన్య ప్రేమకథా చిత్రం ‘చాంద్ మేరా దిల్’. వివేక్ సోనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మి స్తోంది. మే 22న ఈ చిత్రాన్ని విడుదల చేయబో తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ పోస్టర్ లో ఉన్న ‘ప్రేమ కాస్త పిచ్చివాళ్లను చేస్తుంది..

మీకు తెలుసా?’ అనే క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడి యాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం మామూలు ప్రేమకథలా కాకుండా, ప్రేమలో ఉండే గాఢతను, ఆ పిచ్చిని ఇందులో చాలా లోతుగా చూపించ బోతున్నారని ఈ క్యాప్షన్ ద్వారా అర్థమవుతోంది. అనన్య, లక్ష్య ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, ఎంతో ఎమోషనల్‌గా దగ్గరగా కూర్చున్న తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ పోస్టర్‌లో మరో హైలైట్ ఏమిటంటే, ఆ జంట వెనుక ఉన్న బుద్ధ విగ్రహం.

బుద్ధుని సాక్షిగా సాగే ఈ ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ అంటేనే మంచి సంగీతం, విజువల్స్‌కు కేరాఫ్ అడ్రస్. అదే స్థాయిలో ఈ మ్యూజికల్ లవ్ స్టోరీని మే 22న వేసవి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. అనన్య పాండే తన గ్లామర్‌తో, లక్ష్య తన నటనతో ఈ సినిమాలో మ్యాజిక్ చేయబోతు న్నారని తెలుస్తోంది.