01-10-2025 08:28:43 AM
వాగులో కొట్టుకుపోయిన మంగలి రమేష్
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
కౌకుంట్ల : మండల కేంద్రం నుండి ఇస్రంపల్లికి వెళ్లే రహదారిపైగల వాగుపై మంగలి రమేష్ దాటుతున్న సమయంలో వరద ఉధృతికి ప్రమాదవ శాత్తూ కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి(Devarakadra MLA G Madhusudan Reddy) వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందితో మాట్లాడి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. వరద ఉధృతి ఎక్కువ ఉన్న సమయంలో ప్రజలు ఎవ్వరు కూడా వాగులను దాటాలని చూడకూడదని ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు.
ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాచారం అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమాచారం అందించిన వెను వెంటనే అధికారులకు తమకు సమాచారం అందిస్తారని వెంటనే అధికారులకు తమకు సమాచారం అందిస్తారని పేర్కొన్నారు. రమేష్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేకంగా నిగా ఉంచి గాలింపు చర్యలు మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కురుస్తున్న వర్షాల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.