01-10-2025 09:24:26 AM
హైదరాబాద్: మాదన్నపేటలో(Madannapet) తన కుక్క ఇంటి ముందు మలవిసర్జన చేయకుండా ఆపినందుకు ఒక వృద్ధురాలిపై(Old Woman) కానిస్టేబుల్ కుటుంబం(Constable Family ) దారుణంగా దాడి చేసింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై ఒక పోలీసు కానిస్టేబుల్ కుటుంబం దారుణంగా దాడి చేసిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీస్ కానిస్టేబుల్ తన ఇంటి ముందు కుక్కను మలవిసర్జనకు తీసుకెళ్తున్నాడని సమాచారం తెలుసుకున్న వృద్ధురాలు తన ఇంటి ముందు కుక్కను ఎందుకు మలవిసర్జన చేయిస్తున్నావని ప్రశ్నించింది.
దీంతో ఆగ్రహించిన కానిస్టేబుల్ తన భార్య, సోదరిని పిలిచాడు. వారు వృద్ధురాలిని దుర్భాషలాడి దారుణంగా దాడి చేశారు. సీసీటీవీ ఫుటేజీలో మహిళలు కర్రలు, పిడికిలితో వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మాదన్నపేట పోలీస్ స్టేషన్(Madannapet Police) పరిధిలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదన్నపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ చంద్రకాంత్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.