01-10-2025 02:15:02 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): దూరవిద్య ద్వారా విద్యను అభ్య సించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గృహిణులను, మహిళలను, ఖైదీల ను యువత ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్, అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. హైదరాబా ద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివరిటీ 26వ స్నాతకోత్సవం మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రఖ్యాత వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, విద్యావేత్త, రచయిత ప్రేమ్‌రావత్‌లకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. విద్యార్థులకు పట్టాలు అందజేశారు. వివిధ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను అందజేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగించారు. ప్రతిభ గల విద్యార్థులకు అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే చదువుతో పాటు పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచిం చారు.
డిజిటల్ విద్య, నైపుణ్య సాధికారత, ఉపాధి కల్పనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆయన కొనియా డారు. ఆదివాసీ, గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం అంటే సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తు న్న ప్రయత్నం గొప్పదని ప్రశంసించారు. ట్రాన్స్‌జెండర్ విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత స్కాలర్‌షిప్‌లు రాజ్యాంగ విలువలను కాపాడేలా ఉన్నాయని చెప్పారు.
ఉద్యోగం చేస్తూ చదువుకోవడం, గృహిణులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పేద విద్యా ర్ధులు, ఖైదీలకు అంబేద్కర్ యూనివర్సిటీ ఓ గొప్ప అవకాశంగా అభివర్ణించారు. విద్యార్థులతో పాటు ఖైదీలు కూడా పట్టభద్రులు కావడం సంతోషంగా ఉన్నదని, ఇది వారిలో పరివర్తనకు నాంది కానుందని పేర్కొన్నారు.
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ మాట్లాడుతూ.. మారుతు న్న ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తోందని, భారతదేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో దూర, డిజిటల్ విద్య ఓ కీలక శక్తిగా మారిందన్నారు. ఈ స్నాతకోత్సవంలో విశ్వవిద్యా లయ ఉప కులపతి ప్రొ. ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.