calender_icon.png 1 October, 2025 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనం చేసే పని ప్రజల మదిలో నిలవాలి

01-10-2025 08:32:00 AM

శతశాతంతో విద్యార్థులకు బలమైన పునాది

రూ 3 కోట్లతో గిరిజన భవన్ నిర్మాణానికి జివో విడుదల 

 విలేకరుల సమావేశంలో  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మనం చేసే పని పదికాలాలపాటు పదిలంగా ఉండాలనేదే నా సంకల్పమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గిరిజనులకు రిజర్వేషన్(Tribal Reservation) అమలైన రోజే రూ 3 కోట్ల లతో గిరిజన భవన్ నిర్మాణానికి జివో విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గిరిజన భవన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నో యేండ్ల పోరాటాల ఫలితంగా 1976 లో  ఇందిరాగాంధీ ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో గిరిజనులకు  విద్య, ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేశారని దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదవులు నిర్వహించారని చెప్పారు.

మూడు అంతస్తుల్లో  నిర్మాణం  చేస్తున్న గిరిజన భవన్ లో  ఒక అంతస్తులో విద్యార్థులు చదువుకోవడానికి మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రంథాలయం ఉంటే నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుంది ఆయన చెప్పారు.   మీ పోరాటాలతోటే తాండాలు  గ్రామపంచాయతీ అయ్యాయి అని  మీ తాండాలలో మీరే పాలన చేస్తున్నారంటే అది మీరు చేసిన పోరాట ఫలితమే అనిగుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా ప్రతి తాండాకు రవాణా వ్యవస్థను ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిమన్నారు. తాండాల లోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుకే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల్లో శతశాతం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది వేస్తే వారు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన చెప్పారు.  మన పిల్లల కోసం మన మహబూబ్ నగర్ లో ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు , ఎటిసి సెంటర్లను తేవడం జరిగిందన్నారు. ఈ కళాశాలలో మన పిల్లలను చేర్పించి నైపుణ్య శిక్షణ లలో తర్ఫీదు ఇప్పించాలని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ నాయకులు ఆర్ శేఖర్ నాయక్, రఘు నాయక్, లింగం నాయక్, కె.శేఖర్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రాజు నాయక్, తులసి రామ్ నాయక్, కిషన్ నాయక్,  గిరిజన సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.