calender_icon.png 1 October, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి

01-10-2025 08:21:57 AM

పెన్ పహాడ్ :  ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా విద్యుత్ షాక్ ఘటనలో మృతి చెందిన సంఘటన మండలంలోని చిదేళ్ళ, అనాజీ పురం గ్రామాల్లో చోటుచేసుకుంది.  పోలీసులు.. స్థానికులు.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..చిదేళ్ళ గ్రామానికి చెందిన సురభి సైదులు గౌడ్ (45) తమ ఇంటి వద్ద ఉన్న ఇనుప దండెం కు చేపలు ఎండ పెడుతుండగా ఇనుప వైర్ కు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అలాగే అనాజీపురం గ్రామానికి చెందిన దుబాని లక్ష్మయ్య (35) తన సొంత వ్యవసాయ పొలములో గడ్డి కొస్తుండగా విద్యుత్ మోటార్ వైరు బయటకి తేలి ఉండగా విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామాలు  తెలిపారు మృతుడు లక్ష్మయ్య కు భార్య కొడుకు ఉన్నారు.