ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బర్ల మంగ
ఆర్డీవో అనంతరెడ్డి సమక్షంలో ఎన్నిక
ఫలించిన క్యాంపు రాజకీయాలు
ఇబ్రహీంపట్నం, మే 24 : ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. రం గారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశాల మేరకు ఆర్డీఓ అనంతరెడ్డి సమక్షంలో శుక్రవారం మున్సిపల్ కార్యా లయంలో ఎన్నిక జరిగింది. మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో బర్ల మంగ (కాంగ్రెస్) మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. కాగా, మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా మెజార్టీ కౌన్సిలర్లు తనకు వ్యతిరేకంగా ఉన్నారని వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి (బీఆర్‌ఎస్) ముందస్తుగా రాజీనామ చేసిన సం గతి తెలిసిందే.
మే 4వ తేదీన ఆయనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిం ది. అవిశ్వాసం నెగ్గిన నాటి నుండి కౌన్సిలర్ బర్ల మంగ (కాంగ్రెస్) మున్సిపల్ చైర్మన్ పదవిని ఎలాగైనా చేజిక్కించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. బల నిరూపణ కోసం కౌన్సిలర్లను ముందస్తు క్యాం పులకు తరలించారు. దీంతో, ఆయ న క్యాంపు రాజకీయం ఫలించింది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి హాజరై, మొత్తం 13 మంది మె జార్టీ కౌన్సిలర్లు బర్ల మంగకు మద్దతుగా నిలిచి వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.






