14 August, 2026 | 3:11 AM

తుక్కుగూడలో భారీ అగ్నిప్రమాదం

25-05-2024 01:43 AM

తప్పిన ప్రాణనష్టం

మహేశ్వరం, మే 24 : రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో శుక్రవారం అర్ధరాత్రి హార్డ్‌వేర్ పార్క్‌లోని శ్రీనాథ్ ఒవన్ ప్యాక్ కంపెనీలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని ఒకటో నంబర్ యూని ట్లో భారీగా మంటలు, దట్టమైన పొగలు, వ్యాపించడంతో కంపెనీ సిబ్బంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రమాద సమయంలో కం పెనీలో ౫౦మంది సిబ్బంది ఉన్నారు. అప్రమత్తమై వెంటనే బయటకు పరగులు తీశా రు.౫ ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ నష్టం జరుగపోయిన ఆస్తినష్ట వాటిల్లింది. చుట్టుపక్కల వారు భయందోళనతో పరుగులు తీశారు.