14 August, 2026 | 6:25 AM

నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి

25-05-2024 01:40 AM

వికారాబాద్, మే 24 ( విజయక్రాంతి) : నాణ్యమైన విత్తనాలు వాడటం వల్ల పది నుండి పదిహేను శాతం అధిక దిగుబడి వస్తుందని తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధా రాణి అన్నారు. శుక్రవారం తాండూరు వ్యవసాయ పరిశోధన సంస్థ కేంద్రంలో కంది విత్తనాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నల్లరేగడి భూముల్లో కంది పంటను జంటసాళ్ళ పద్దతిలో సాగు చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుందన్నారు. నీటి ముంపునకు గురికాకుండా బోదె కాలువల పద్దతిలో పంట భూమిని తయారు చేసుకొని కంది పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు.

ఈ సందర్బంగా విత్తన మేళాకు హాజరైన శాస్త్రవేత్తలు వివిధ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై, మెరుగైన యాజమన్య, సమగ్రయాజమన్య పద్దుతులపై అవగాహన కల్పించారు. ఈ విత్తన మేళాలో తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం రూపొందినచిన పలు రకాల కంది వంగడాలను రైతులకు పరిచయం చేశారు. తెలంగాణ కంది టి.డి.ఆర్.జీ ఆశ ( ఐ.సి.పి.ఎల్. 87119) రకాల విత్తనాలను రైతులకు అం దించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ సుజాత, డాక్టర్ యము న, డాక్టర్ శేఖర్, డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.