25 March, 2026 | 2:16 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

ముంబైకి బరోడా షాక్

15-10-2024 01:50 AM

రంజీ ట్రోఫీ

వడోదర: ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ముంబైకి షాక్ తగిలింది. బరోడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై 84 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఎలైట్ గ్రూప్ భాగంగా బరోడాతో మ్యాచ్‌లో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది.

టాపార్డర్ వైఫల్యం చెందగా.. మిడిలార్డర్‌లో సిద్దేశ్ లాడ్ (59), శ్రేయస్ అయ్యర్ (30) పర్వాలేదనిపించడంతో ముంబై కనీసం 150 పరుగు ల మార్క్‌ను దాటగలిగింది. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 6 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించగా.. మహేశ్ పితియా రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు బరోడా రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది. 

మిగిలిన మ్యాచ్‌ల్లో తమిళనాడు ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించింది. ఇక చంఢీఘర్ జట్టుపై రైల్వేస్, పంజాబ్‌పై కేరళ జట్టు, బిహార్‌పై హర్యానా, హైదరాబాద్‌పై గుజరాత్, మేఘాలయాపై సర్వీసెస్, ఉత్తరాఖండ్‌పై హిమాచల్ ప్రదేశ్,  ఆంధ్రపై విదర్భ జట్టు విజయాలు సాధించాయి. రెండో రౌండ్ మ్యాచ్‌లు అక్టోబర్ 18 నుంచి జరగనున్నాయి.