25 March, 2026 | 12:29 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

పాకిస్థాన్ ఓటమి

15-10-2024 01:51 AM

భారత్ ఆశలు గల్లంతు

దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. టీమిండియా సెమీ స్ చేరాలంటే న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. కానీ ఆ జట్టు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించడంతో పాటు హర్మన్ సేనను బయటికి తీసుకొచ్చిం ది.

సోమవారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 54 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఓపెనర్ సుజీ బేట్స్ (28) టాప్ స్కోరర్. పాక్ బౌలర్లలో నష్రా సందూ 3 వికెట్లు పడగొట్టింది.

అనంతరం బరిలోకి దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. మునీబా (15) మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకుంది. కివీస్ బౌలర్లలో అమేలీ కెర్ 3 వికెట్లు తీయగా.. రోస్‌మేరీ, కార్సన్, లియా, జోనస్ తలా ఒక వికెట్ తీశారు.