8 August, 2026 | 2:51 AM

భారతీయ ఆత్మకు ప్రతిరూపం చేనేత

08-08-2026 01:46 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీ ద్రుష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని భారతీయ ఆత్మకు ప్రతిరూపం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆ ప్రతిరూపానికి ఆచరణగా ’లోకల్ ఫర్ వోకల్’ అనే నినాదంతో భారత చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికులందరికీ బండి సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో, కట్టుబట్టను అందిస్తున్న నేతన్న కూడా అంతే ముఖ్యమని, శతాబ్దాల సాంస్క్రుతిక వారసత్వ సంపదకు ప్రతిబింబం నా నేతన్న అని పేర్కొన్నారు. భారతీయ చరిత్ర, సంస్క్రుతి, కళాత్మకకు ప్రతిరూపం చేనేత అని, మన దేశంలో వ్యవసాయం తరువాత రెండో అతిపెద్ద కుటీర పరిశ్రమ చేనేత రంగంమాత్రమేనని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది ఈ చేనేత రంగాన్ని నమ్ముకుని బతుకుతున్నారని అన్నారు. దేశంలో చేనేత అంటేనే మన తెలంగాణ, మన సిరిసిల్ల, మన ఉమ్మడి కరీంనగర్ అగ్రభాగాన నిలుస్తోందని పేర్కొన్నారు.