విద్యార్థులకు మౌళిక వసతులు కల్పించాలి
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
అదనపు కలెక్టర్ చంద్రయ్య
బెల్లంపల్లి / కన్నెపల్లి, ఆగస్టు 12: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య కోరారు.
గురువారం బెల్లంపల్లి పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా, వారికి సులభంగా అర్థమయ్యే రీతిలో పా ఠ్యాంశాలను బోధించాలని, విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంపొందించే విధంగా బోధనా పద్ధతులను అవలంబించాలని, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటులో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గానికి కేటాయించిన పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను, ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి మండల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కోరా రు. అనంతరం కన్నెపల్లిలోని జడ్పీహెచ్‌ఎస్ ను సందర్శించి పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు మదాసి రమాదేవి బాల్య మిత్రురాలు ఎం.టి. రాజేశ్వరి సహకారంతో సుమారు 1.80 లక్షల విలువ గల సైకిళ్లు, కుట్టుమిషన్ లను విద్యార్థులకు అదనపు కలెక్టర్ చంద్రయ్య పంపిణీ చేశారు.
విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసు కొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కేజీబీవీని సందర్శించి విద్యార్థుల కు అందిస్తున్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు.
తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి ఓటరు జా బితా సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నెన్నెల మండలం నందులపల్లి జీపీనిసందర్శించి గ్రామంలోని పారిశుధ్య నిర్వహణ, ఇటీవల కురిసిన వర్షాలతో ఏర్పడిన పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, ఎంపీఓ శ్రీనివాస్, జిల్లా డి.సి.ఈ.బి. కార్యదర్శి పి.మహేశ్వరరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరాములు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






