calender_icon.png 25 September, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రపురం శ్రీ సాయి నగర్‌లో బస్తీ దర్శన్

25-09-2025 03:18:26 PM

రామచంద్రపురం: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం  శ్రీ సాయి నగర్ కాలనీలో బస్తీ దర్శన్ కార్యక్రమంలో కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బురుగడ్డ పుష్పనగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలను ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులతో చర్చించారు. కాలనీలో స్ట్రీట్ పోల్స్ సమస్యలు, కరెంటు సమస్యలు ఉన్నాయని నివాసులు తెలియజేయగా, డీఈ భాస్కర్, ఏఈ రాజేష్, లైన్ మెన్‌లు వెంటనే పర్యటించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ఇంటర్నెట్ కేబుల్స్ కారణంగానే సమస్యలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. రోడ్లలో గుంతలను పూడ్చే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు వీర్శెట్టి, గోవర్ధన్ రెడ్డి, బ్రహ్మరాజు, రాజ్‌కుమార్, నాగేశ్వర్, చంద్రమౌళి, మురళి మనోహర్, కాలనీ సొసైటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.