25-09-2025 03:16:58 PM
సదాశివనగర్, (విజయక్రాంతి): దసరా సెలవుల్లో భాగంగా వృత్తి విద్యపై ఇంటర్ షిప్(Internship ) కొరకు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని హై - టెక్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో, సదాశివనగర్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల విద్యార్థులకు వృత్తి విద్యపై పది రోజులపాటు ఇంటెర్న్ షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాట్టు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి విద్య నేర్చుకునే విద్యార్థులకు సాధారణ పాఠశాల రోజులతో పాటు సెలవు దినాలలో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా వారిలో నైపుణ్యత మరింత పెంపొందే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు 10 రోజులపాటు వృత్యంతర శిక్షణ అందించి అనంతరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు సెలవుల్లోని సమయాన్ని శిక్షణ కోసం కేటాయించి సద్వినియోగం చేసుకొని విద్యలో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజారెడ్డి తో పాటు ఒకేషనల్ ట్రైనర్ శ్రీకాంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.